నవతెలంగాణ ఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)చైర్మన్‌గా జై షా వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో డైరెక్టర్లందరి సంపూర్ణ మద్దతుతో ఆయన పునర్నియామకాన్ని నేడు ఐసీసీ అధికారికంగా ధ్రువీకరించింది. దీంతో ప్రపంచ క్రికెట్ అత్యున్నత పీఠంపై జై షా మరోసారి కొనసాగనున్నారు.
గతంలో 2024ఆగస్టు 27న తొలిసారి ఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షా,అదే ఏడాది డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు.అప్పట్లో కేవలం 35ఏళ్ల వయసులోనే ఈ బాధ్యతలు చేపట్టి,ఐసీసీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన చైర్మన్‌గా ఆయన రికార్డు సృష్టించారు. తన రెండో పదవీకాలంలో జై షా నేతృత్వంలో 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం, మహిళా క్రికెట్ మరింత అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ విస్తరణతో పాటు అసోసియేట్ దేశాలకు మరిన్ని అవకాశాలు కల్పించడం వంటి కీలక అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.





కామెంట్‌లు (0)