Magazines

పులిమడుగులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

25 నిమిషాల క్రితం

gambling
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం


ముగ్గురు పట్టివేత..మరో ముగ్గురు పరారీ


నవతెలంగాణ-రామకృష్ణాపూర్: పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, రూ.2,600నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు రామకృష్ణాపూర్ ఎస్సై శ్రీధర్ తెలిపారు. రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పులిమడుగు గ్రామంలో కొందరు వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు.

పోలీసులను గమనించిన ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పరారవగా,మరో ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు.వారి వద్ద ఉన్న మూడు సెల్‌ఫోన్లు, రూ.2,600నగదు,పేకముక్కలను స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. పట్టుబడిన వారు:అజ్మీరా బొజ్జు (46),సండ్ర సురేష్ (40),సండ్ర ఎల్లయ్య (45).పరారీలో ఉన్నవారు:కూన్సత్ సరేందర్,సండ్ర రాములు,భూక్యా రతిలాల్. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్