Magazines

కొండెక్కిన కోడిగుడ్డు...ఒక గుడ్డు రూ.9..!

3 గంటల క్రితం

Egg Price Hike
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ హైదరాబాద్:

తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.నవంబర్ 13నాటికి హైదరాబాద్ మార్కెట్‌లో 100గుడ్ల హోల్‌సేల్ ధర రూ.640కి చేరుకుంది. గత వారంతో పోలిస్తే డజను గుడ్లపై ఏకంగా రూ.16మేర ధర పెరగడంతో,రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు రూ.8నుండి రూ.9వరకు విక్రయిస్తున్నారు.

ఎల్‌నినో ప్రభావం కారణంగా కోళ్ల దాణా,ముఖ్యంగా మొక్కజొన్న ధరలు విపరీతంగా పెరగడంతో పాటు,మార్కెట్‌లో గుడ్ల సరఫరా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో సతమతమవుతున్న సామాన్య,మధ్యతరగతి ప్రజలకు కోడిగుడ్ల ధరల పెరుగుదల మరింత ఆర్థిక భారంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్