నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక,గణాంకాల శాఖలో ఖాళీగా ఉన్న 102పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)చర్యలు చేపట్టింది.ఈ నోటిఫికేషన్ ద్వారా మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (MPSO),అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO)ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 27వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన రాత పరీక్ష 2027జనవరి నెలలో నిర్వహించే అవకాశం ఉంది.ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.36,750నుండి రూ.1,06,990వరకు ఆకర్షణీయమైన వేతనం అందనుంది.






కామెంట్‌లు (0)