Magazines

థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం...11మంది మృతి

26 నిమిషాల క్రితం

FIREACCIDENT
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ ఫుకెట్‌: థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఫుకెట్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. పశ్చిమ తీరంలోని ప్రసిద్ధ పటాంగ్ బీచ్ సమీపంలో ఉన్న ఓ వాణిజ్య భవనంలో (రెంటల్ వెహికిల్స్ భవనం)తెల్లవారుజామున 3.17గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోగా,మరో 16మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిలో 15మంది థాయ్‌లాండ్ పౌరులు కాగా, మరొకరు మయన్మార్ దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో విదేశీ పర్యాటకులెవరూ మరణించలేదని,ఎవరికీ గాయాలు కాలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్