Sunday, November 2, 2025
E-PAPER
Homeఖమ్మంఖమ్మంలో దారుణం..బాలికపై సామూహిక లైంగికదాడి

ఖమ్మంలో దారుణం..బాలికపై సామూహిక లైంగికదాడి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో దారుణం జరిగింది. బాలిక (13)పై సామూహిక లైంగికదాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు లైంగికదాడికి పాల్పడ్డారు. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ బాలుడు వచ్చి ‘నీ తమ్ముడు కింద పడిపోయాడు’ అని బాలికకు మాయమాటలు చెప్పి ఓ ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరు బాలురతో కలిసి ఓ యువకుడు.. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రులు పని మీద హైదరాబాద్‌ వెళ్లగా, ఇంట్లో ఉన్న నానమ్మ, తాతయ్య బయటకు వెళ్లారు. బాలిక తల్లి.. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ సూరజ్ నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -