నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం వీరన్న గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న గాదె వీరయ్యపై ఇద్దరు అనుమానితులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని రెంజల్ ఎస్సై కే చంద్రమోహన్ తెలిపారు. గాదె వీరయ్య తాను డ్యూటీ చేసే సమయంలో రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఇద్దరు అనుమానితులుగా తిరుగుతుండడంతో వారిని ఇంత రాత్రి ఎందుకు వచ్చారు అని అడిగాడు. దీంతో కోపోద్రిక్తులై.. మమ్మల్ని అడగడానికి నీవెవరివని వారు ఆయనపై దాడి చేశారని ఎస్ఐ తెలిపారు. పాఠశాల ప్రహరీ పైనుంచి దూకి వచ్చి వారిపై దాడి చేశారని ఆయన వెల్లడించారు. వాచ్ మెన్ తో పాటు, అతని భార్య శ్యామలపై దాడి చేశారని వారు అందించిన వివరాల ప్రకారం జాదవ రాజు అనే వ్యక్తితో పాటు మరొకరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాచ్మెన్ పై దాడి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES