Sunday, February 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరఫా క్రాసింగ్‌ నుంచి వచ్చే పాలస్తీనియన్లపై దాడులు

రఫా క్రాసింగ్‌ నుంచి వచ్చే పాలస్తీనియన్లపై దాడులు

- Advertisement -

– ఐక్యరాజ్య సమితి ఆందోళన
ఐక్యరాజ్య సమితి :
ఈజిప్ట్‌తో గల రఫా సరిహద్దు క్రాసింగ్‌ గుండా గాజాలోకి తిరిగి వచ్చే పాలస్తీనియన్లపై దారుణంగా జరుగుతున్న దాడుల పట్ల ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల విభాగం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. గాజావ్యాప్తంగా పౌర ప్రాంతాల్లో ఇజ్రాయిల్‌ వైమానిక దాడులను, కాల్పులను, బాంబు దాడులను కొనసాగిస్తోందని ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల సమన్వయ కేంద్రం (ఓసీహెచ్‌ఏ) పేర్కొంది. ఫలితంగా అనేకమంది మరణిస్తున్నారని, విధ్వంసం కూడా తీవ్రంగానే వుందని పేర్కొంది. పాలస్తీనా శరణార్ధుల కోసం ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన జబలయా బాలుర స్కూలును గురువారం ఇజ్రాయిల్‌ బలగాలు ధ్వంసం చేశాయని ఓసీహెచ్‌ఎ తెలిపింది. ఆరు పాఠశాలలు గల ఆ కాంపౌండ్‌లో ఇది చివరి పాఠశాల, దీంతో మొత్తంగా ఆ కాంపౌండ్‌ అంతా నాశనమైంది. పౌరులు, పౌర మౌలిక వసతులను ఎప్పుడూ రక్షించాలని, వాటిని లక్ష్యంగా చేసుకోరాదని, లేదా మిలటరీ కార్యకలాపాలకు వాడుకోరాదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. గాజాకు తిరిగివస్తున్న పాలస్తీనియన్ల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని, వారిని అసభ్యంగా దూషించడం, వారిపై దాడులు చేయడం వంటి దారుణాలకు దిగుతున్నారని వీటన్నింటికి ఇజ్రాయిల్‌ మిలటరీ మద్దతు వుంటోందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది. ఇజ్రాయిల్‌ చెక్‌ పాయింట్‌ నుండి తిరిగి వస్తున్న కొంతమంది సాయుధ పాలస్తీనియన్లకు చేతులు బేడీలు వేసి, కండ్లకు గంతలు కట్టి, వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని, వారిని తనిఖీ చేస్తూ వారి వద్ద గల డబ్బు, ఇతర వస్తువులను లాక్కుంటున్నారని కార్యాలయం తెలిపింది.గురు, శుక్రవారాల్లో మొత్తంగా 11 మానవతా మిషన్‌లు సమన్వయం చేసుకుంటూ వ్యవహరిం చాయని, 98మందిని వెనక్కి తీసుకువచ్చాయని కార్యాలయం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -