Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్చందానగర్‌ ఖజానా జ్యువెలర్స్‌లో చోరీకి యత్నం

చందానగర్‌ ఖజానా జ్యువెలర్స్‌లో చోరీకి యత్నం

- Advertisement -

– వెండి అపహరణ
– సిబ్బందిపై కాల్పులు.. పోలీసుల రాకతో పరార్‌
– ఘటనా స్థలాన్ని పరిశీలించిన సైబరాబాద్‌ సీపీ
నవతెలంగాణ-చందానగర్‌

హైదరాబాద్‌-ముంబై జాతీయ రహదారి పక్కనున్న ఖజానా జ్యువెలరీ షాప్‌లో భారీ దోపిడీకి దుండగులు ప్రయత్నించారు. షాప్‌ సిబ్బందిపై కాల్పులు జరిపారు. పోలీసులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఉదయం జరిగింది. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి ఘటనా స్థలానికి చేరుకుని, దోపిడీకి యత్నించిన తీరును షో రూమ్‌ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీసీ కెమెరాలను పరిశీలించారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు వెల్లడించారు. చందానగర్‌ జాతీయ రహదారి పక్కనున్న ఖజానా జ్యువెలరీ షోరూం ప్రతిరోజూ లాగానే మంగళవారం ఉదయం 10:30 గంటలకు తెరిచారు. తెరిచిన ఐదు నిమిషాల్లోనే ఆరుగురు దుండగులు లోపలికి ప్రవేశించారు. ఒక దుండగుడు షోరూమ్‌లోకి ముందే వచ్చి రెక్కీ నిర్వ హించి వెళ్లినట్టు సీసీ ఫుటేజ్‌ని బట్టి తెలుస్తోంది. లోపలికి ప్రవేశించిన దుండగులు వారి వద్ద ఉన్న గన్‌తో షోరూం సిబ్బందిని బెదిరించి కాల్పులు జరిపారు. అసిస్టెంట్‌ మేనేజర్‌ సతీష్‌ కాలులోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. దాంతో షోరూం సిబ్బంది భయపడి పరుగులు పెట్టారు. బంగారం ఉన్న అల్మార తాళం చెవి ఎక్కడని అసిస్టెంట్‌ మేనేజర్‌ సతీష్‌ను దుండగులు బెదిరించారు. ఘటనా స్థలంలో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒకటి అసిస్టెంట్‌ మేనేజర్‌ సతీష్‌ కాలిపై, రెండవది షో రూమ్‌లో రూఫ్‌పైకి కాల్పులు జరిపారు. ఈ సమయంలోనే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల రాకను గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపో యారు. నిందితులు షాప్‌లో పది నిమిషాలు మాత్రమే ఉన్నారు. వెండి వస్తువులు దోచుకెళ్లారు. బంగారు ఆభరణాలు చోరీకి గురి కాలేదు. ఎంత వెండి చోరీకి గురైంది అనేది స్పష్టత రావాల్సి ఉంది. దుండగుల వద్ద మూడు తుపాకులు ఉన్నట్టుగా షాప్‌ సిబ్బంది చెప్పిన వివరాలను బట్టి తెలుస్తోంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఆరు ప్రత్యేక బృందా లను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల జిల్లాల పోలీసులను, టోల్‌ గేట్ల వద్ద కూడా ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img