పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
నవతెలంగాణ-శివ్వంపేట
తొమ్మిదేండ్ల బాలికపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదుచేసిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధుకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలానికి చెందిన బాలికపై మంగళవారం రాత్రి అదే గ్రామానికి చెందిన చేగూరి ఆంజనేయులు లైంగిక దాడికి యత్నించాడు. దాంతో బాలిక రోదిస్తూ కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. ఆగ్రహించిన బాలిక కుటుంబసభ్యులు, గ్రామస్థులు నిందితునిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న శివ్వంపేట ఎస్‌ఐ మధుకర్ రెడ్డి ఆధ్వర్యం లో పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకొన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మధుకర్ రెడ్డి తెలిపారు.
బాలికపై లైంగికదాడికి యత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



