Friday, September 26, 2025
E-PAPER
Homeకరీంనగర్నకిలీ 'చెత్త ఏరే' ముసుగులో దొంగతనం యత్నం..

నకిలీ ‘చెత్త ఏరే’ ముసుగులో దొంగతనం యత్నం..

- Advertisement -

నవతెలంగాణ – శంకరపట్నం
గ్రామాల్లో చెత్త/డస్ట్ ఏరుకునే ముసుగులో దొంగతనాలకు పాల్పడటానికి ప్రయత్నించిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. హుజురాబాద్ కు చెందిన  తూర్పటి రేణుక మరియు తూర్పటి సమ్మక్కగా గుర్తించారు.వీరు సంచులు పట్టుకుని గ్రామాల్లో తిరుగుతూ.. ప్రధానంగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకునేవారు. దొంగతనం చేసేందుకు తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నించినట్లు, పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు,స్థానిక ఎస్సై శేఖర్ రెడ్డి ప్రజలకు  విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానితులు సంచరిస్తున్నట్లు, గమనిస్తే, వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై  సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -