- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ: వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామానికి చెందిన కడారి లాలమ్మ (80) గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందింది. అత్త లాలమ్మ మృతి విషయం తెలుసుకొని ఇంటికి చేరుకున్న లాలమ్మ కోడలు లక్ష్మమ్మ అత్త మృతితో మనస్థాపానికి గురై శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఒకే ఇంట్లో అత్తా కోడలు మృతి చెందడంతో గ్రామంలో విషాద సాయలు అలుముకున్నాయి. లాలమ్మ కొడుకు వెంకటయ్య , లక్ష్మమ్మ చిన్న కొడుకు గణేష్ గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
- Advertisement -

 
                                    