– స్మశాన వాటిక రోడ్లను పరిశీలించని అధికారులు
– క్షేత్రస్థాయి పరిశీలనపై దృష్టి పెట్టని మునిసిపల్ అధికారులు
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్
నవతెలంగాణ – కామారెడ్డి
మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా బృందం గత వర్షాలకు ధ్వంసం అయిన హౌసింగ్ బోర్డ్ స్మశానవాటిక రోడ్డునూ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ మొన్నటి వరదల్లో కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కు సంబంధించిన స్మశాన వాటిక రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని, కనీసం ఆక్కడికి వెళ్లాలంటే ఆ రోడ్డుపై ఒక్కరు నడిచే స్థలం కూడా లేకుండా వరదల ఉధృతికి ధ్వంసమైందన్నారు. జిల్లా అధికారులు ఏ ఒక్కరు ఇటువైపు వచ్చిన పాపన పోలేదని, కనీసం తాత్కాలిక రోడ్డును నిర్మించలేదని విమర్శించారు.
క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించడం లేదని విమర్శించారు. మంత్రులు, కలెక్టర్ వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేస్తూ పర్యటన ముగిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే కాకుండా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు తెగిపోయి రోడ్లన్నీ ధ్వంసం అయినప్పటికీ ఇంకా అనేక గ్రామాల్లో కనీసం మొరం, మట్టి వేయలేదని రాకపోకలు లేక రైతులు గ్రామాల్లో ప్రజలు, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు సందర్శించి ప్రభుత్వ ఉన్నత అధికారులకు గాని ప్రభుత్వాన్ని గాని నివేదిక అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ప్రధానంగా కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ తమకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జిల్లా ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని లేకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు, మూదం అరుణ్ తదితరులు పాల్గొన్నారు.