– మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
నవతెలంగాణ-హవేలీఘనపూర్
భారీ వర్షాలతో విపత్తు కాలంలో ప్రజలకు అండగా జిల్లా అధికారం యంత్రాంగం పూర్తిస్థాయిలో పనిచేస్తోందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. హవేలీఘనపూర్ మండలంలోని పోచమ్మరాల్ సమీపంలో జాతీయ రహదారిపై కొట్టుకుపోయిన బ్రిడ్జి, అర్మీ బృందం చేపట్టిన సహాయక చర్యలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. మంజీరా పరివాహక గ్రామం సర్ధన, బూర్గుపల్లిలో రోడ్డు కొట్టుకుపోగా తాత్కాలిక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసిందన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సింధు రేణుక, డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి బాల్‌రెడ్డి, ఏఈఓ భార్గవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్యాల శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, సాయిబాబా, సిద్ధగిరి గౌడ్, వెంకట రాములు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.
విపత్తు కాలంలో ప్రజలకు అండగా అధికార యంత్రాంగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES