నవతెలంగాణ – భువనగిరి
ఈ నెల19వ తేదీనజరగ జరుగు దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఇండస్ట్రీ ఏరియాలో సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఆటో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజా కార్మిక వర్గ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిందని దేశంలో ఉన్న పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు ఓడిగం చేస్తుందన్నారు.
కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు నాలుగు కోడ్ లు చేసి యాజమాన్యాలకు బానిసలుగా చేస్తున్నదన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను సంపదను కార్పొరేట్ పెట్టుబడుదాలకు అప్పచెప్పుతున్నదన్నారు. అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న కార్మిక అసంఘటిత కార్మికులకు సమగ్రమైన శాసనం చేయడం లేదన్నారు. స్కీం వర్కర్లుగా పనిచేస్తున్న అంగన్వాడి ఆశ మధ్యాహ్నం భోజనం లాంటి ఉద్యోగ కార్మికులను పర్మినెంట్ చేయడం లేదన్నారు.
కనీస వేతనం చెల్లించడం లేదన్నారు. కార్మిక వర్గంతో వెట్టి చాకిరి చాకిరి చేసుకుంటున్నారని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికుల పర్మినెంట్ చేయాలని కార్మిక చట్టాలు అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక విధానాలకు నిరసనగా జరుగుతున్న సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ, నాయకులు నరసింహ, ఐలయ్య, బిక్షపతి, రాములు, కోటయ్య, కొమురయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.