Tuesday, December 23, 2025
E-PAPER
Homeక్రైమ్అదుపుతప్పి ఆటో బోల్తా..

అదుపుతప్పి ఆటో బోల్తా..

- Advertisement -

ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు..
ఆరుగురికి స్వల్ప గాయాలు
నవతెలంగాణ – మద్నూర్

మండల పరిధిలో ప్రయివేటు స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడి 8 మందికి గాయాలైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని అవల్గావ్ గ్రామానికి 8 మంది విద్యార్థులు ఎప్పటిలాగే మండల కేంద్రంలోని ప్రయివేటు పాఠశాలకు ఆటోలో బయలుదేరారు. అయితే మద్నూర్ కు సమీపానికి రాగానే ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు హరి, కపిల్ కు కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ఆరుగురు విద్యార్థులైన శివం, విష్ణు కాంత్, సాయి, గణేష్ , అభిజిత్ ,మరో శివం స్వల్ప గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం నుంచి బయట పడడంతో విద్యార్థుల తలిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

అయితే స్థానికులు గాయాల పాలైన విద్యార్థులను మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజు, మండల విద్యాశాఖ అధికారి రాములు నాయక్, రెవిన్యూ ఆర్ ఐ శంకర్ వెంటనే ఆస్పతికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులు చదువుతున్న ప్రయివేట్ పాఠశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు చికిత్స తీసుకుంటున్న విద్యార్థులను పరామర్శించారు. వీరితో పాటు ఆ గ్రామ సర్పంచ్ మాన్యా బాయి కూడా విద్యార్థులను పరామర్శించారు. స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు తెప్ప తుకారాం విద్యార్థులను పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని ఎస్ఐ రాజు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -