నవతెలంగాణ – మద్నూర్
యూరియా యాప్ పై రైతులకు, ఫర్టిలైజర్ డీలర్లకు మండల వ్యవసాయ అధికారి రాజు సోమవారం అవగాహన కల్పించారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను రైతులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పట్టా పాస్బుక్ కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యాక యూరియా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే సంబంధిత గ్రామ ఏఈవో దగ్గర మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని యూరియా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రైతులు యూరియా కోసం వచ్చే ముందు స్లాట్ బుక్ చేసుకొని ఫర్టిలైజర్ షాప్ కి వెళ్లాలని సూచించారు. ఒకసారి యూరియా బుక్ చేసుకుంటే 24గంటల వరకు బుక్ చేయబడి ఉంటుంది. 24 తర్వాత గంటల తరవాత బుక్ చేసుకున్న యూరియా తీసుకోకపోతే స్లాట్ క్యాన్సల్ అవుతుందన్నారు. మళ్ళీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో దుకాణాల డీలర్లు, రైతులు పాల్గొన్నారు.
యూరియా యాప్ పై అవగాహన కల్పించిన ఏవో రాజు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



