Friday, January 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహెడ్ నర్సింగ్ ఆఫీసర్ కు ప్రశంసాపత్రం అందజేత..

హెడ్ నర్సింగ్ ఆఫీసర్ కు ప్రశంసాపత్రం అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
నాంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి హెడ్ నర్సింగ్ ఆఫీసర్ జి సరళ కుమారి విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ఆమెకు ఉత్తమ ప్రతిభ ప్రశంస పత్రం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి శుక్రవారం అందజేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రారెడ్డి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరియా ఆస్పత్రిలోని లేబర్ రూమ్ ఇన్చార్జిగా ఎనలేని సేవలు ఆమె అందిస్తున్నారని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు మోటివేషన్ చేస్తూ వారికి ధైర్యాన్ని కల్పిస్తున్నారు అన్నారు. నార్మల్ డెలివరీల సంఖ్య పెంచడంలో ఆమె కృషి అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్  సంగారెడ్డి, నర్సింగ్ సూపర్డెంట్ విజయకుమారి, నర్సింగ్ ఆఫీసర్ లు తదితరు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -