- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం కుష్టు వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర వైద్యురాలు శ్రీలేఖ కుష్టు వ్యాధి అవగాహన ప్రచారంలో చేయవలసిన వాగ్దానం గురించి వివరించారు. మహాత్మా గాంధీ కలలుగన్న విధంగా సమీప భవిష్యత్తులో కుష్టు వ్యాధి రహిత భారత దేశ నిర్మాణంలో అందరితో కలిసి కృషి చేస్తానని ఆస్పత్రి ఆవరణంలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



