నవతెలంగాణ – భిక్కనూర్
కుష్టు వ్యాధి రహిత సమాజం కోసం వైద్య సిబ్బందితోపాటు సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర కుష్టు వ్యాధి నివారణ బృందం సభ్యులు తెలిపారు. మంగళవారం భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కుష్టు వ్యాధి ప్రాథమిక దశలోనే గుర్తించి మాత్రల ద్వార నిర్మూలించవచ్చన్నారు. కుష్టు వ్యాధి సర్వే పై ఏఎన్ఎం ఆశా వర్కర్లకు అవగాహన కల్పించారు. అనంతరం ఆస్పత్రి రికార్డులు పరిశీలించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుష్టువ్యాధి నివారణ బృందం సభ్యులు డాక్టర్ రాజు, డాక్టర్ ప్రదీప్, డిప్యూటీ వెంకటేశ్వరాచారి, శ్రీధర్, సురేందర్, మెడికల్ అధికారి యేమిమా, హెచ్ ఈ ఓ వెంకటరమణ, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
కుష్టు వ్యాధి నివారణపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



