- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
రాజీవ్ విద్య యోజన పథకంలో భాగంగా ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు 9వ,10వ ఎస్సి విద్యార్థులు దరఖా చేసుకోవాలని ఎడ్ బిడ్, ముధోల్ వసతి గృహ సంక్షేమ శాఖ అధికారులు ఆర్, నగేష్, శారద లు అవగాహన కల్పించారు. గురువారం ముధోల్ తానూరు మండలంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9, పదో తరగతి చదువుతున్న ఎస్సి విద్యార్థులు ఫ్రీ మెట్రిక్ ఉపకర వేతనాలకు దరఖాస్తులు చేసుకునేలా ప్రధాన ఉపాధ్యాయులు ప్రోత్సహించలని కోరారు. ఆయా పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు తగిన గడువు సమయంలో దరఖా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయులుతదితరులు ఉన్నారు.
- Advertisement -



