నవతెలంగాణ – రెంజల్ : మండలంలోని వీరన్న గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్సై పి. చంద్రమోహన్ ఈవ్ టీజింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఈవ్ టీజింగ్, సెల్ ఫోన్ యాప్ లు, మైనర్ డ్రైవింగ్ పైన అవగాహన కల్పించారు. విద్యార్థులు శారీరక మానసిక, ఆరోగ్య పరంగా ఉండడమే కాకుండా, క్రమశిక్షణ అలవర్చుకోవాలని బాలికలకు తెలియజేశారు. చిన్నారులు సెల్ ఫోన్ల వాడకంపై ప్రత్యేక ఆకర్షణకు గురవుతున్నారని, వాటికి దూరంగా ఉంటూ.. తమ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గంగా ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈశ్వర్, గ్రామ పెద్దలు రాయ నరసయ్య, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈవ్ టీజింగ్ పై విద్యార్థులకు అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES