Wednesday, July 23, 2025
E-PAPER
Homeఖమ్మంసెప్టిక్ ట్యాంకర్ ల యజమానులకు అవగాహన..

సెప్టిక్ ట్యాంకర్ ల యజమానులకు అవగాహన..

- Advertisement -
  • – మలమూత్ర వ్యర్ధాలను నిర్మానుష ప్రదేశాల్లో నే వదలాలి: కమీషనర్ నాగరాజు
  • నవతెలంగాణ – అశ్వారావుపేట
  • సెప్టిక్ ట్యాంకర్ ల ద్వారా సేకరించే మానవ మల మూత్రాలును ఊరుకు దూరంగా నిర్మానుష ప్రాంతాల్లో నే వదలాలిని, డ్రైనేజీ, మురుగు కాలువల్లో వదిలితే చట్టపరంగా అయిన చర్యలు తీసుకుంటాం అని అశ్వారావుపేట మున్సిపల్ కమీషనర్ బి.నాగరాజు సెప్టిక్ ట్యాంకర్ ల యజమానులకు సూచించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో తన అద్యక్షతన ట్యాంకర్ ల యజమానులతో సమావేశం అయి అవగాహన కల్పించారు. సెప్టిక్ ట్యాంక్ లో మానవ వ్యర్ధాలు( మల మూత్రాలును) తరలించే సమయంలో ట్యాంకర్ పైపులు లీకేజీ లేకుండా జాగ్రత వహించాలని,రోడ్ల వెంట ఏ మాత్రం వ్యర్ధాలు పడకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ప్రతీ ట్యాంకర్ డ్రైవర్ కు విధిగా డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వాహనానికి పొల్యూషన్ సర్టిఫికేట్, ఆర్.సీ మున్సిపాల్టీ పరిధిలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలని సూచించారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -