Thursday, October 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టంపై అవగాహన అవసరం: కలెక్టర్

మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టంపై అవగాహన అవసరం: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
పని ప్రదేశంలో మహిళలందరికి  సురక్షితమైన వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత యజమాని, యాజమాన్యాలదేనని అన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళా కార్మికులు మరియు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఈ చట్టం పట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న ఆక్షన్ఎయిడ్  కర్ణాటక ప్రాజెక్టు సంస్థను ఈసందర్భంగా అభినందించారు. జిల్లాలో అన్ని సంస్థల్లో అంతర్గత కమిటీలు ఏర్పాటు తప్పనిసరిగా చేయాలని సూచించారు.

ఆక్షన్ఎయిడ్ కమ్యూనిటీ ట్రైనర్ సురుపంగ శివలింగం విజ్ఞప్తి మేరకు పోష్ చట్టం పుస్తకాలు మరియు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు ముద్రించిన కరపత్రాలు  జిల్లా కలెక్టర్ హనుమంతరావు,  డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆకాంక్ష్ యాదవ్, స్థానిక సంస్థల కలెక్టర్  భాస్కరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -