Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైబర్ భద్రతపై అవగాహన

సైబర్ భద్రతపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – గట్టు
మండల పరిధిలోని మాచర్ల గ్రామంలో సోమవారం నాడు ఎస్ ఎస్ టి ఆధ్వర్యంలో సమావేశం – సంక్షేమ పథకాలు, సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో స్టేట్ కోఆర్డినేటర్ అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలైన పి ఎం ఎస్ బి వై  (ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన  ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన  అటల్ పెన్షన్ యోజన లలో తప్పనిసరిగా చేరి ఆర్థిక భద్రత పొందాలని సూచించారు. అదే విధంగా, పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని కోరారు. మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని, సైబర్ నేరానికి గురైతే తక్షణమే 1930 టోల్-ఫ్రీ నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు అనూష, ప్రకాష్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -