Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంటరానితనంపై అవగాహన

అంటరానితనంపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
పౌర హక్కుల దినోత్సవం ప్రతినెల 30న మండలంలోని ఒక్కో గ్రామంలో నిర్వహిస్తున్నట్లు మండల గిర్దావర్ ఎం.శంకర్ అన్నారు. సోమవారం పౌర హక్కుల దినోత్సవంను మద్నూర్ మండలం లోని లచ్చన్ గ్రామ పంచాయతీ లో గ్రామస్థులతో  నిర్వహించారు. ఈ సందర్భంగా మండల గిర్దావర్ ఏం శంకర్  మాట్లాడుతూ గ్రామంలో ఎస్ సీ, ఎస్ టి ల పట్ల కులవివక్ష చూపిన, అంటరానితనం చూయించిన చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలకు శిక్షార్వులు అని తెలిపారు.

గ్రామంలో దళితులపై వివక్ష చూపిన, అంటరానితనం తో దూరం పెట్టిన అట్టి వారిపై క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని అట్టి చర్యలకు పోకుండా గ్రామంలో అందరూ ఒక కుటుంబం లా కలిసి మెలిసి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డెన్ సందీప్, గ్రామ కార్యదర్శి సంగీత,  పోలీస్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -