Sunday, June 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వచ్ఛ కామారెడ్డి-స్వచ్ఛ గ్రామం అంశంపై అవగాహన

స్వచ్ఛ కామారెడ్డి-స్వచ్ఛ గ్రామం అంశంపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పెద్దగుల్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ మాధవరావు దేశాయి అధ్యక్ష స్వచ్ఛ కామారెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ కామారెడ్డి-స్వచ్ఛ గ్రామం అనే అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాలు పచ్చగా ఉంటేనే ఆరోగ్యం బాగు బాగుంటుందని ఎంపీడీఓ తెలిపారు. గ్రామంలో చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయవద్దని సూచించారు. ప్రభుత్వం అందజేసిన డబ్బాలలోనే చెత్తను వెయ్యాలని చెప్పారు. ఉదయం పూట గ్రామపంచాయతీకి సంబంధించిన చెత్త బండ్లు వచ్చినప్పుడు వాటిని అందులో వేయాలని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఫారెస్ట్ అధికారి,  గ్రామ సర్పంచ్ , పాటు ఉప సర్పంచ్, జిపి కార్యదర్శి, జిపి కార్యవర్గ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు , గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -