Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైనిక్ ఫలితాల్లో బి టాపర్ విద్యార్థుల ప్రభంజనం

సైనిక్ ఫలితాల్లో బి టాపర్ విద్యార్థుల ప్రభంజనం

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
ఇటీవల వెలువడిన నవోదయ సైనిక్ పరీక్ష ఫలితాల్లో కామారెడ్డి పట్టణానికి చెందిన వివేకానంద బీ టాపర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సైనిక్ ఫలితాల్లో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 26 మంది విద్యార్థులు సైనిక్ పరీక్షలో అర్హత పొందడం చాలా గర్వకారణమని యాజమాన్యం తెలియజేశారు. ఈ ఫలితాల పట్ల పాఠశాల కరస్పాండెంట్ గురువేందర్ రెడ్డి , ప్రిన్సిపాల్ వీరభద్రప్ప , డైరెక్టర్ రవిరెడ్డి హర్షం వ్యక్తం చేసారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులను వారి తల్లిదండ్రులను, సైనిక్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.  ఈ సందర్భంగా తల్లిదండ్రులు వివేకానంద పాఠశాల ఇంత మంచి ఫలితాలు సాధించడం కామారెడ్డికే గర్వకారణమని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -