Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు

మద్నూర్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
బాబు జగ్జీవన్ రావ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా-సంతోష్మేస్త్రి అన్నారు. గ్రామపంచాయతీలో ఆదివారం బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ ప్రజల కోసం కంటి, ముక్కు, చెవి, గొంతు తదితర వ్యాధుల వారి కోసం ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉచిత వైద్య శిబిరం వైద్యులు, ఉపసర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పంచాయతీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -