రష్యా నుంచి ఇరాన్‌కు మిగ్-29 యుద్ధ విమానాలు
టెహ్రాన్ : ఇజ్రాయిల్, అమెరికా దేశాలకు ఇది నిజంగా చేదు వార్తే. రష్యా నుంచి ఇరాన్‌కు మిగ్-29 యుద్ధ విమానాలు చేరుకున్నాయి. దీంతో టెహ్రాన్ వైమానిక బలం ఇనుమడించింది. రష్యా నుంచి వచ్చిన మికోయన్ మిగ్-29 ఫైటర్ జెట్‌లో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఇది గగనతలంలోనే శత్రువుల యుద్ధ విమానాలను కూల్చివేయగలదు. ఈ విమానం ఇజ్రాయిల్‌కు పెనుముప్పుగా పరిణమిస్తుందని భౌగోళిక రాజకీయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ యుద్ధ విమానాన్ని ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో డిజైన్ చేశారు. ఇటీవల ఇరాన్‌పై ఇజ్రాయిల్ దళాలు కయ్యానికి కాలు దువ్విన విషయం తెలిసిందే. ఇరాన్‌లోని అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ బాంబు దాడులు జరిపింది. ఇప్పుడు ఇరాన్ చేతికి మిగ్-29 యుద్ధ విమానాలు అందడం ఇజ్రాయిల్‌కు మింగుడు పడని విషయమే. రష్యా నుంచి వచ్చిన యుద్ధ విమానాలను షిరాజ్‌లో మోహరించామని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు అబోల్ఫజ్ జొహారేవంద్ తెలిపారు.
అమెరికా లక్ష్యాలను ఛేదించే క్షిపణి పరీక్ష సక్సెస్
ఇరాన్ ఇటీవల ఐసీబీఎం (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్) ఖొర్రంషహర్-5ను తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. అమెరికాలోని లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యం ఈ క్షిపణి సొంతం. ఇరాన్ తయారు చేసిన అత్యాధునిక క్షిపణుల్లో ఇది ఒకటి. పైగా రష్యా నుంచి ఎస్-400, చైనా నుంచి హెచ్‌క్యూ-9 గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ పొందబోతోంది. ఇవి ఇరాన్ గగనతల రక్షణ సామర్ధ్యాన్ని మరింత పెంచుతాయి. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలో ఇప్పటికే ఎస్-300, బావర్-373, ఖర్దాద్, సయాద్, ఎస్-200 వంటివి ఉన్నాయి. ఇవన్నీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆందోళన కలిగించేవే.
అమెరికా, ఇజ్రాయిల్‌లకు చేదు వార్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES