Saturday, September 20, 2025
E-PAPER
Homeజాతీయంఉమర్‌ ఖాలీద్‌, షార్జీల్‌ ఇమామ్‌ల బెయిల్‌ పిటిషన్లు వాయిదా

ఉమర్‌ ఖాలీద్‌, షార్జీల్‌ ఇమామ్‌ల బెయిల్‌ పిటిషన్లు వాయిదా

- Advertisement -

22న విచారణ

న్యూఢిల్లీ : సామాజిక కార్య కర్తలు, మాజీ విద్యార్థి నాయకులు ఉమర్‌ ఖాలీద్‌, షార్జీల్‌ ఇమామ్‌ల బెయిల్‌ పిటిషన్లు వాయిదాపడ్డాయి. ఉమర్‌ ఖాలీద్‌, షార్జీల్‌ ఇమామ్‌తో పాటు గుల్ఫిషా ఫాతిమా, మీరన్‌ హైదర్‌లు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 22కు వాయిదావేసింది. ఈ బెయిల్‌ పిటిషన్లు 2020లో ఢిల్లీ అల్లర్ల కేసులో ఉపా చట్టం కింద నమోదైన కేసుకు సంబంధించినవి. వీరి బెయిల్‌ పిటిషన్లను సోమవారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 2న బెయిల్‌ను నిరా కరించిన ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మొత్తం తొమ్మిది మంది సుప్రీంకోర్టును ఆశ్ర యించారు. వీరిలో ఉమర్‌ ఖాలీద్‌, షార్జీల్‌ ఇమామ్‌, ఫాతిమా, హైదర్‌లతో పాటు మహ్మద్‌ సలీమ్‌ ఖాన్‌, షిఫా ఉర్‌ రెహ్మాన్‌, అక్తర్‌ఖాన్‌, అబ్దుల్‌ ఖాలీద్‌ సైఫీ, షాదాబ్‌ అహ్మద్‌లు ఉన్నారు. నిందితుల్లో మరొకరు తస్లీమ్‌ అహ్మద్‌ బెయిల్‌ పిటిషన్‌ను కూడా ఈనెల 2న హైకోర్టు మరో ధర్మాసనం తిరస్కరించింది. కాగా ఉపా చట్టం కింద నమోదైన కేసుకు సంబంధించి వీరు 2020 నుంచి జైలోలోనే ఉంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -