Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల్ బ్యాడ్మింటన్ జూ. బాలుర కోచింగ్ క్యాంప్ ప్రారంభం..

బాల్ బ్యాడ్మింటన్ జూ. బాలుర కోచింగ్ క్యాంప్ ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి.
జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ జూనియర్ బాలుర కోచింగ్ క్యాంప్ ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  ఇందల్వాయిలో ప్రారంభమైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రామ రెడ్డి, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు భూపతి రాజేశ్వర్ తెలిపారు. ఈ క్యాంపు ను జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్షులు గడ్డం శ్రవణ్ రెడ్డి, సర్పంచ్ లోకాని గంగామణి గంగారం, ఉపసర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘ సెక్రెటరీ శ్యామ్, ఉపాధ్యక్షులు నరేందర్, కృష్ణ పాల్గొని క్యాంపును ప్రారంభించారు.

ఈ క్యాంపు మూడు రోజులు నిర్వహించుకుని ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఈనెల 9, 10 ,11 తేదీలలో ఆర్మూర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తిరుపతి, గోపి,వార్డ్ సభ్యులు దాసు, సత్యనారాయణ, శ్రీనివాస్, చందు తోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -