నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంగళగిరి జిల్లా కేంద్రానికి చెందిన బండారు పుష్పలత కవయిత్రి అవార్డు అందుకున్నారు. అవార్డు గ్రహీత పుష్పలత మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి లో జరిగిన కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జూపల్లి కృష్ణారావు జ్యోతి ప్రజ్వాలనతో ప్రారంభించారు. ప్రముఖ కవులు కవయిత్రులతో కవిసమ్మేళనంలో భువనగిరి యాదాద్రి జిల్లా నుండి ప్రముఖ కవయిత్రి,రచయిత్రి, వక్త బండారు పుష్పలత పాల్గొని వారు రాసిన “బతుకు నిచ్చిన బతుకమ్మ ” అనే కవితను ఆలపించగా , భువనగిరి వాసి బండారు పుష్పలత సీనియర్ కవి బి ఎస్ రాములు చేతులమీదుగా కవయిత్రి అవార్డు అందుకున్నట్లు తెలిపారు.
కవయిత్రి అవార్డును అందుకున్న బండారు పుష్పలత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES