Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బంధు విజయవంతం..

బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బంధు విజయవంతం..

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
బీసీ వర్గాల గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ నాయకులు బొడ్డు నర్సింలు యాదవ్ అన్నారు. సోమవారం మండల వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. బీసీ కమిషన్ సిఫారసులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. బీసీ జేఏసీ నాయకులు శాంతియుతంగా బంద్ నిర్వహించినందుకు ప్రజ లకు, వ్యాపార వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు.

బంద్‌ అనంతరం తొగుట మండల కేంద్రంలో బీసీ నాయకులు, కార్యకర్తలు సమావేశమై రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పాత్కుల వెంక టేశం, సుతారి రమేష్, సిరినేని గోవర్ధన్, నందారం నరేందర్ గౌడ్, కంకణాల నర్సింలు, దోమల కొము రయ్య, కురుమ యాదగిరి, కడారి నరేందర్, రడం భాస్కర్, ప్రసాద్, బొడ్డు తిరుపతి చిప్ప నర్సింలు, సిలివెరీ శ్రీనివాస్ గౌడ్, కల్లెపు భానుచందర్, ఆత్మ కూరి రాజు, ముచ్చర్ల ఆంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -