– క్యూలో బండరాళ్లు పెట్టిన రైతులు
నవతెలంగాణ-వేల్పూర్(ఆర్మూర్)
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పచ్చల నడ్కుడ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. గురువారం ఉదయమే క్యూలైన్‌లో పాసుబుక్కులు పెట్టిన రైతులు వర్షాలతో రాళ్లను పెట్టి నిరీక్షించారు. యూరియా కొరత లేకుండా సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అది కనబడటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు వరి, మొక్కజొన్న పంటలను ఎక్కువ మొత్తంలో సాగుచేశారు. యూరియా అవసరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బారులు తీరుతున్నారు. యూరియా బస్తాలు తక్కువగా ఉండటంతో రైతులంతా ఒకే మాటపై ఉంటూ ఒక్కొక్కరు రెండు బస్తాల చొప్పున యూరియా తీసుకోవడానికి ఒప్పుకోవడంతో గొడవ లేకుండా ప్రశాంతంగా పంపిణీ జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు సరిపడా యూరియాను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
యూరియా కోసం బారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES