Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నూతన ఉత్పాదనలు ప్రారంభించిన బీఏఎస్ఎఫ్ ఇండియా

నూతన ఉత్పాదనలు ప్రారంభించిన బీఏఎస్ఎఫ్ ఇండియా

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : బిఏఎస్ఎఫ్ రెండు వినూత్న ఉత్పాదనలను మార్కెట్లోకి తీసుకొచ్చిందని గిరిధర్‌ రానువ, బిజినెస్‌ డైరెక్టర్‌, అగ్రికల్చరల్‌ సొల్యూషన్స్‌, బిఎఎస్‌ఎఫ్‌ ఇండియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాలెక్సియో, మిబెల్యా, భారతీయ వరి రైతులకు మెరుగైన మరియు అత్యధిక నాణ్యమైన దిగుబడులు సాధించడానికి ఇవి సహాయపడతాయన్నారు. బిఏఎస్ఎఫ్ వారి వినూత్నమైన ఆధునిక కెమిస్ట్రీ అయిన వాలెక్సియా కీటకనాశనిని ప్రపంచంలోనే మొట్టమొదటగా భారతీయ వరి రైతులకు అందిస్తున్నారన్నారు. ప్రెక్సియో యాక్టివ్ తో శక్తివంతమైన కీటక నాశిని వరిలో దోమపోటును నియంత్రిస్తుందన్నారు. మిబెల్యా శిలీంద్రనాశిని భారతదేశంలో మొదటగా ప్రారంభించబడుతున్న రెవిసోల్ కెమిస్ట్రీ, ఇది తన యొక్క అనుకూలమైన రెగ్యులేటరి ప్రొఫైల్ మరియు సెలెక్టివిటిని తెగుళ్ళ నుంచి వరి పంటను రక్షిస్తుంది. వీటిని ప్రారంభించడం ద్వారా విశ్వ వ్యూహంలో భాగంగా వరి పంటపట్ల తనకు గల నిబద్ధతను బిఏఎస్ఎఫ్ చాటుకుంటోంది. వరి రైతులకు సమగ్ర పరిష్కారాల పోర్టుఫోలియోను అందిస్తోందన్నారు. హైదరాబాద్, ఇండియా బిఏఎస్ఎఫ్ ఇండియా తన ఆధునిక గ్లోబల్ పంటరక్షణ పరిష్కారాల్లో రెండు రకాలు అయిన వాలెక్సియా కీటకనాశినిని, మిబెల్యా శిలీంద్రనాశినిని ప్రారంభించింది. భారతదేశంలో అత్యంత ముఖ్య ఆహార పంట అయిన వరి పంటకు ఇవి సేవలందిస్తాయి. ఈ రెండు వినూత్న పరిష్కారాలను ప్రవేశపెట్టడం భారతదేశపు జాతీయ ఆహార భద్రత ఎజెండాకు సహాయపడుతుంది. వరి పంటకు తీవ్ర నష్టం కలిగించే కీటకాలైన దోమ పోటును అదుపుచేయడం, పొడ తెగులు లాంటి తెగుళ్ళను నియంత్రించడం ద్వారా వరి రైతులు తమ పంట దిగుబడులను పెంచుకోవడానికి ఈ పరిష్కారాలు సహాయపడతాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad