Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐకేపి కార్యాలయం వద్ద బతుకమ్మ వేడుకలు

ఐకేపి కార్యాలయం వద్ద బతుకమ్మ వేడుకలు

- Advertisement -

– ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్ఐ అనిల్ రెడ్డి 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని ఐకేపి కార్యాలయం వద్ద మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన మహిళా సంఘాల సభ్యులు తీరక్క పూలతో బతుకమ్మలను తయారుచేసి ఆడి పాడారు. మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన బతుకమ్మను ఎత్తుకొని కొలమ్మ కోలో బతుకమ్మ కోలో పాటకు నృత్యం చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకువెళ్లి గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఆంధ్రయ్య, ఐకేపీ ఏపీఎం కిరణ్ కుమార్, సీసీలు గంగా లలిత, భాగ్యలక్ష్మి, మండల మహిళా సమైక్య సభ్యులు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -