Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు

శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాలలో ఆదివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఆడపడుచులు అద్భుతంగా జరుపుకునే ఉత్సవం ఈ బతుకమ్మ పండుగ అన్నారు. ఆడవారు శక్తిమాత అయిన గౌరమ్మను నవరాత్రులు పూజించి, అమ్మవారి ఆశీస్సులను పొంది వచ్చే ఏడాది వరకు అష్టైశ్వర్యాలను అందించి మమ్మల్ని చల్లగా కాపాడుమని వేడుకొని బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు.

ప్రకృతిలో లభించే పూలను సైతం పూజించే సాంప్రదాయం హైందవ సంస్కృతిలోనే ఉందన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా బతుకమ్మ ఉత్సవాన్ని జరుపుకొని అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశారు. దుర్గాదేవి నవరాత్రులను పురస్కరించుకొని విద్యార్థులు అమ్మవారి తొమ్మిది అవతారాల్లో ముస్తాబైన తీరు అలరించింది. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -