నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ పండుగను ఘనంగా జరిపారు. కళాశాల ప్రాంగణం పూల తేరులతో ముస్తాబై, సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించేలా కళాత్మకంగా అలంకరించబడిన బతుంకమ్మలను ప్రిన్సిపాల్ పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం లెక్చరర్లు, విద్యార్థులు కలిసి బతుకమ్మను ప్రదర్శించి, ఆటలు ఆడి, నృత్యాలతో సందడి చేశారు.
మహిళా అధ్యాపకులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా నృత్యం చేశారు.ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఇలాంటి పండుగలు మన సంస్కృతిని, సంప్రదాయాన్ని నిలుపుకుంటూ, విద్యార్థుల్లో సామూహిక చైతన్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడతాయి” అని అన్నారు. ఈనెల 27వ తేదీ నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆదేశాల మేరకు దసరా సెలవులు ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెల్లడించారు. అనంతరం బతుకమ్మను కళాశాల ప్రాంగణంలోని కుంటలో నిమజ్జనం చేయడం జరిగిందిఈ బతుకమ్మ సంబరాలలో ప్రిన్సిపాల్ తో పాటు కళాశాల అధ్యాపకులు ,బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES