Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ: కలెక్టర్

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ మహిళల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని అన్ని శాఖల ఆధ్వర్యంలో ఐదవ రోజు బతుకమ్మ పండుగ సంబరాలు కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ మహిళల సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక గా నిలుస్తుంది అని జిల్లా కలెక్టర్ అన్నారు. తెలంగాణ మహిళల ఆత్మీయత, ఆధ్యాత్మికత, సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక గా నిలుస్తుంది అన్నారు. ప్రకృతిని దైవంగా పూజించి పండుగగా బతుకమ్మ పండుగ అన్నారు.

ఇలాంటి పండుగలను నిర్వహించడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలుపవచ్చు అన్నారు. భావి తరాల కు చెందిన పిల్లలకు సంస్కృతి , సాంప్రదాయాలతో పాటు విలువలను కూడా తెలపడం ముఖ్యమన్నారు. మహిళా ఉద్యోగులు  కలిసి బతుకమ్మ ఆడి , పాటలు పాడి బతుకమ్మ పండుగ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ  సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో కలెక్టరేట్ ప్రాంగణం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో రెవిన్యూఅదనపు కలెక్టర్ వీరా రెడ్డి, జెడ్పి సీఈవో శోభారాణి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, కలెక్టరేట్ మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -