- Advertisement -
బీరప్ప దేవాలయంలో నీళ్లు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : వర్షాలు కురవడంలేదని భువనగిరి మండలంలోని విరవెల్లి గ్రామంలో మహిళలు బతుకమ్మ ఆటాడి, ఆ గ్రామంలోని బీరప్ప కామరాతి దేవాలయంలో దేవుళ్లకు నీళ్లు పోశారు. వర్షాలు కురవాలని కోరుతూ శివయ్య పేరు మీద జానపద పాటలను పాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద కురుమ రేగు బీరప్ప, రేగు ఇస్తారి, రేగు అంజయ్య, మహిళలు రేగు దీపిక, కవిత, కమలమ్మ, శ్రీలత లు పాల్గొన్నారు.
- Advertisement -