క్రీడామంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత
ఎల్బీ స్టేడియంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ సాంస్కతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి సతీమణి వాకిటి లలితా శ్రీహరి అన్నారు. బతుకమ్మ పండుగ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, మన సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కతిని సముచితంగా గౌరవించుకోవాలి. దేవతామూర్తులను పూలతో పూజిస్తాం. పూలను పూజించటం బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని ఆమె తెలిపారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో లలితా శ్రీహరి పాల్గొన్నారు. శాట్జ్ చైర్మెన్ సతీమణి కె. హర్షశ్రీ శివసేనా రెడ్డి, ఎండీ సోనీబాల దేవి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సతీమణి డాక్టర్ రుచి జయేశ్ రంజన్‌లు క్రీడాకారిణిలు, మహిళా ఉద్యోగులు.. కోచ్‌లు, సిబ్బంది కుటుం సభ్యులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకున్నారు.