తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించిన బీసీ సంఘాలు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
42% బీసీ రిజర్వేషన్ బిల్లు 9వ షెడ్యూల్లో చేరుస్తూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. బి సి రిజర్వేషన్ను అమలుపరచాలని తంగళ్ళపల్లి తహశీల్దార్ కు బిసి సంఘాల నాయకులు సోమవారం వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషనన్ను 42 శాతానికి పెంచుతూ ఆమోదించిందని తెలిపారు. ఈ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపి, 7 నెలలుగా పెండింగ్లో ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసి సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రామగౌడ్, దుర్గయ్య, భాస్కర్, బాబు, తదితరులు పాల్గొన్నారు
బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



