Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeమానవిజాగ్రత్తగా చూసుకోవాలి

జాగ్రత్తగా చూసుకోవాలి

- Advertisement -

సర్వేంద్రియానాం నయనం ప్రధానం ఈ మాట మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. నిద్ర లేచినప్పటి నుంచి చదవడం, రాయడం, డ్రైవింగ్‌ చేయడం ఇలా ఒక్కటేమిటి ఏ పని చేయాలన్నా మన నేత్రాలే మనల్ని నడిపిస్తాయి. అయితే.. మన రోజువారీ కార్యక్రమాలు సాఫీగా సాగిపోవాలంటే ఆరోగ్యకరమైన కంటి చూపు చాలా అవసరం. నేడు మొబైల్‌ ఫోన్‌ లేని వాళ్లని చూడటం చాలా అరుదనే చెప్పాలి. పిల్లలు మారాం చేస్తున్నారని మొబైల్‌, ట్యాబ్స్‌ ఇస్తూ.. తల్లిదండ్రులే తొలుత అలవాటు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ అలవాటుని మాన్పించలేక బాధపడుతున్నారు. స్క్రీన్‌ సమయాన్ని తగ్గించడం, ఆరు బయట పిల్లలతో సరదాగా గేమ్స్‌ ఆడటం వల్ల పిల్లల్లో హ్రస్వ దష్టి (మయోపియా) అభివద్ధి చెందకుండా కాపాడుతుందని పరిశోధనలు చూపుతున్నాయి. అలానే పిల్లలకి ప్రారంభ దశలోనే కంటి చూపు సమస్యలను గుర్తించి సరైన చికిత్స చేయిస్తే మంచిది.
ఏం తినాలంటే?
విటమిన్‌- ఎ పుష్కలంగా ఉండే క్యారెట్లు, మొరంగడ్డ, బచ్చలికూర తినడం ద్వారా దష్టి లోపాన్ని తగ్గించుకోవచ్చు. అలానే రేచీకటి రాకుండా కాపాడుకోవచ్చు. వీటితోపాటు సిట్రస్‌ పండ్లు, బెర్రీలూ కంటి చూపును కాపాడుకోవటంలో ఉపయోగపడ తాయి. పండ్లు, కూరగాయలు, తణధాన్యాలతో పాటు సాల్మన్‌ చేపలు కూడా కంటి ఆరోగ్యంతోపాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఉడికించిన గుడ్లను తినడం ద్వారా కంటి కండరాలు బలపడతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డ్రైవింగ్‌ లేదా ఎండలో బయటికి వెళ్లినప్పుడు సన్‌ గ్లాసెస్‌ లేదా టోపీని ధరించడం ద్వారా కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మొబైల్‌ లేదా ల్యాప్‌ ట్యాప్‌ స్క్రీన్‌ని ఏకబిగిన గంటలకొద్దీ చూడకుండా విరామం తీసుకోండి. ప్రతి 20 నిమిషాలకు స్క్రీన్‌ నుంచి పక్కకి వెళ్లి కాసేపు కళ్లకి విశ్రాంతినివ్వండి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad