Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటించాలి..

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటించాలి..

- Advertisement -

వైద్యురాలు డాక్టర్ క్రిస్టినా..
నవతెలంగాణ – డిచ్ పల్లి

గ్రామంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని గ్రామ కార్యదర్శి రాములకు ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ చేయాలని దోమలు లార్వా వృద్ధి చెందకుండా టెమో ఫాస్ స్ప్రే చేయాలని, దోమల వల్ల కలిగే వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా,ఫైలేరియా లాంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.

శుక్రవారం ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గౌరారం ఉపకేంద్రం లోని డోంకల్ గ్రామంలో సూర్య ఆరోగ్య సంస్థ సహకారంతో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు .ఈ ఆరోగ్య శిబిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్ వాయి వైద్యాధికారిని డాక్టర్ షారోన్ షైనీ క్రిస్టినా రోగులందరిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో జ్వరం ,దగ్గు, జలుబు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులందరికీ చికిత్స అందించారు. 15 మందికి తెమడ పరీక్షలు నిర్వహించాగ, పదిమందికి డెంగ్యూ పరీక్ష నిర్వహించడంతో అందరికీ నెగిటివ్ రావడం జరిగిందని పేర్కొన్నారు.

ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ మాట్లాడుతూ గ్రామంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని గ్రామ కార్యదర్శి రాములకు ఆదేశించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,దింతో ఏలాంటి అనారోగ్య సమస్యలు దారి చేరకుండా ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ ఆలీ, సూర్య ఆరోగ్య సంస్థ కో ఆర్డినేటర్  వినోద్, ఎంఎల్ హెచ్పి లు కీర్తన,మలేహ, సుచరిత, గ్రామ కార్యదర్శి రాములు,ఆరోగ్య కార్యకర్త లక్ష్మి ఆశా కార్యకర్తలు రజిత,డొంకల్ లక్ష్మి గౌరారం లక్ష్మీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -