Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధిక శబ్దాలతో జాగ్రత్త..

అధిక శబ్దాలతో జాగ్రత్త..

- Advertisement -

అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రత్నకుమారి..
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 

దీపావళి సందర్భంగా కాల్చే బాణాసంచా వల్ల శబ్ద కాలుష్యం గణనీయంగా పెరిగి చెవి, ముక్కు గొంతు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని కోఠి ఈ ఎన్ టి ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రత్నకుమారి అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు దీపావళి సందర్భంగా అధిక శబ్దం గల టపాకాయలు కాల్చకుండా దూరంగాఉండాలన్నారు. బాణాసంచా కాల్చడం వల్ల ముఖ్యంగా పిల్లలు, వృద్దులు,  శ్వాస  సమస్యలు ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.

బాణసంచా వల్ల చెవికి కలిగే నష్టాలు తాత్కాలికంగా లేదా శాశ్వతవినికిపోడి లోపం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. అధిక శబ్దంతో చెవి కర్ణభేరి పొరర, దెబ్బతినవచ్చు అన్నారు. చిన్నపిల్లలు బాణాసంచా ఉపయోగించే క్రమంలో పెద్దవాళ్లు పక్కనే ఉండాలని సూచించారు. అధిక శబ్దం గల టపాకాయలను వినియోగించకపోవడమే మంచిదని సూచించారు. పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు, యువతకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -