– వచ్చే 72 గంటలు అప్రమత్తంగా ఉండండి
– ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు
– అవసరమైతే విద్యాలయాలకు సెలవులు
– ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హౌంకే ప్రాధాన్యత ఇవ్వాలి
– అన్నిశాఖలు సమన్వయంగా పనిచేయాలి: కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.
”లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. ఎక్కడ ఏం జరిగినా సమాచారం కంట్రోల్ రూంకు చేరేలా చూడాలి. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడానికి వెళ్లేదు. సహాయక చర్యలకు అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విద్యుత్ శాఖ అధికారులు మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అత్యధిక వర్షాలు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలి. గతంలో ఊహించని విధంగా ఖమ్మంలో 2 గంటల్లో 42 సెం.మీ వర్షం పడింది. అలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తితే, ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి” అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి, 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. హైదరాబాద్‌లో నీరు ప్రమాద స్థాయికి చేరిన చోట్లకు ప్రజలు వెళ్లకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో మూడు కమిషనరేట్లలో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారం తీసుకోవాలని చెప్పారు. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్‌ఎం రేడియోల్లో పబ్లిక్ అలర్ట్ ప్రసారం చేయాలని చెప్పారు. ”24 గంటల్లో 2 సెంటిమీటర్ల వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణాలు నిర్మాణం అయ్యాయి. క్లౌడ్ బరస్ట్ సమయాల్లో పరిస్థితులను ఎదుర్కొనేలా సన్నద్ధం కావాలి.
సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలి. అత్యవసర టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి. మీడియా తప్పుడు వార్తలతో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయకుండా సమాచార శాఖ ఎప్పటికప్పుడు వారికి సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి” అని ఆదేశించారు.
అధికారుల మధ్య నిరవధికంగా కమ్యూనికేషన్ ఉండేలా అత్యవసర గ్రూప్‌లను ఏర్పాటు చేసి జట్టుగా పరిస్థితులను ఎదుర్కోవాలని చెప్పారు. ఏదైనా జిల్లాలో అధిక వర్షపాత సూచనలు ఉంటే ఆయా ప్రాంతాలపై అవగాహన ఉన్న సీనియర్ అధికారులను అక్కడి పర్యవేక్షణకు ఉపయోగించాలని కోరారు. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలకు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేందుకు వీలుగా వైద్యులు, ఔషధాలు ఇతర ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పిడుగుపాట్లతో పశువులు, మేకలు, గొర్రెలు చనిపోయినప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించి బాధితులకు పరిహారం అందేలా చూడాలని పశుసంవర్ధక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో….
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్‌లు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీస్, పురపాలకశాఖ సహా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలనీ, ప్రజల నుంచి వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
వర్షాలతో జాగ్రత్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES