Tuesday, January 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎలుగుబంటి దాడి.. వ్యక్తికి గాయాలు

ఎలుగుబంటి దాడి.. వ్యక్తికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ-రామాయంపేట
ఎలుగు బంటి దాడిలో ఓ వ్యక్తి గాయాలపాలైన ఘటన మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం దంతేల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దంతేపల్లికి చెందిన కీర్తి సిద్దయ్య మేకలు కాయడానికి అడవికి వెళ్ళాడు. చెట్ల పొదల చాటు నుంచి వచ్చిన ఎలుగు బంటి అతనిపై దాడి చేసింది. దాంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం సిద్దయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అతన్ని పరామర్శించి.. ప్రభుత్వం తరపున బాధితులను ఆదుకుంటామని తెలిపారు. బాధితుడికి సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -