‘శుభం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ సమ్మర్‌లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా స్టోరీ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. డీప్ లవ్‌లో ఉన్న హీరో తన ప్రేమ గురించి, ప్రేయసి గురించి చెబుతూ ఈ వీడియో సాగుతుంది. ‘లవ్ అనేది కావాలని ఎవడు చేయడు, అది అయిపోతది అంతే,
ఒక పిచ్చి పిల్ల కోసం దిల్‌లో విల్లా కట్టేస్తాం, ఆ ఒక్క పిల్ల వల్ల జీవితం ఉల్టా పల్టా అయిపోతున్నా గాల్లో తేలుతుంటం, ప్రాణం పెట్టేస్తం, జాన్ ఇచ్చేస్తం, ఆ వైబే వేరుంటది లే, లవ్ లైట్‌గా ఉన్నంతవరకే బ్రో ఎవడైనా లవర్ బాయ్, అదే లవ్ దిల్ మొత్తం నిండిపోతే అప్పుడు తయారైతడు ఒక దీవాన, ప్యార్ ఒక కిర్రాక్ నషారా బై, సస్తున్నా మస్తు ఉంటది..’ అంటూ హీరో తన లవ్ ఫీల్‌ను చెప్పడం అందర్నీ అలరిస్తోంది. ఈ వీడియోలో హర్షిత్ రెడ్డి కొత్తగా కనిపిస్తున్నారు. ఆయన పర్‌ఫార్మెన్స్ ఇంప్రెస్ చేస్తోంది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ – మానస, ప్రొడక్షన్ డిజైనర్ – ఝాన్సీ గోజల, ఎడిటర్ – హృషికేశ్ పాస్పల్, డీవోపీ – వంశీ పచ్చిపులుసు, మ్యూజిక్ – ఈశ్వర్ చంద్, ప్రొడ్యూసర్స్ – వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి, స్క్రిప్ట్, డైరెక్షన్ – శ్రీకాంత్ సంగిశెట్టి.
అందమైన ప్రేమకథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



