Wednesday, September 17, 2025
E-PAPER
Homeకవితఅందాలసుందరి

అందాలసుందరి

- Advertisement -

నీ భావం భాషగా మారి
అవసరాలు తీర్చిన
అమ్మరా తెలుగు!
నర నరాల్లో పారిన
రుధిర ధారలా మారిన
నాన్న ప్రేమరా తెలుగు!
ఎప్పుడూ నిను
వదలని సోదర
నీడరా తెలుగు!
ఎన్నడూ నిన్ను
మరువని సోదరి
ఆప్యాయతరా తెలుగు!
వధ్యాప్యంలో
అండగా నిలిచిన
బిడ్డల ఆదరణరా తెలుగు!
ప్రాణ స్నేహితునిలా
తోడుండే నిస్వార్థ
రూపురా తెలుగు!
అనుక్షణం నీ మేలు
కోరే ఆత్మీయుల
ఆలింగనం రా తెలుగు!
ప్రాణ స్నేహితునిలా
తోడుండే నిస్వార్థ
నైజంరా తెలుగు!
ఐక్యతను పంచే
దేశ చిత్రానికి
ఆయువుపట్టు రా తెలుగు !
జాతి గర్వమై
రెపరెపలాడే మువ్వన్నెల
జెండారా తెలుగు !
పెదాల నుండి
నిత్యం జారే
అమతధార రా తెలుగు !
పదాల పొందికలో
గెలుపొందిన
అందాల సుందరిరా తెలుగు !
(తెలుగుభాషాదినోత్సవ శుభాకాంక్షలతో )
-షేక్‌ నసీమాబేగం, 9490440865

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -